సుప్రీం కోర్టు 40వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ పి.సదాశివం జులై 19న ఉదయం ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవనలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జస్టిస్ సదాశివం చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Friday, 19 July 2013
Monday, 22 April 2013
బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా అబ్దుల్ హమీద్
ఢాకా: బంగ్లాదేశ్ 20వ అధ్యక్షునిగా అబ్దుల్ హమీద్ నియమితులయ్యారు. హమీద్ నామినేషన్ ఒక్కటే దాఖలైందని, ఆయననే అధ్యక్షునిగా నియమిస్తున్నామని ప్రధాన ఎన్నికల కమిషనర్ కాజీ రకీబుద్దీన్ అహ్మద్ ఏప్రిల్ 22న ప్రకటించారు. బంగ్లా అధ్యక్షునిగా ఉన్న జిల్లియుర్ రహ్మాన్ గత నెల మరణించడంతో అధ్యక్ష స్థానానికి ఎన్నికలు నిర్వహించాల్సివచ్చింది.
Monday, 15 April 2013
వెనుజువెలా అధ్యక్ష ఎన్నికల్లో మాడ్యురో విజయం
కారకస్: వెనెజువెలా అధ్యక్ష ఎన్నికల్లో చావెజ్ వారసుడు నికోలస్ మడ్యురో స్వల్ప అధిక్యంతో విజయం సాధించారు. సోషలిస్టు పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాడ్యురో 50.7 శాతం ఓట్లతో విజయం సాధించినట్లు అక్కడి ఎన్నికల అధికారులు ప్రకటించారు. విపక్ష అభ్యర్థి హెన్రిక్‌కు 49.1 శాతం ఓట్లు వచ్చాయి. హన్రిక్‌పై మాడ్యురో మూడు లక్షల మెజారిటీని సాధించారు.
Subscribe to:
Posts (Atom)