Monday 22 April 2013

బంగ్లాదేశ్‌ అధ్యక్షుడిగా అబ్దుల్‌ హమీద్‌



ఢాకా: బంగ్లాదేశ్‌ 20వ అధ్యక్షునిగా అబ్దుల్‌ హమీద్‌ నియమితులయ్యారు. హమీద్‌ నామినేషన్‌ ఒక్కటే దాఖలైందని, ఆయననే అధ్యక్షునిగా నియమిస్తున్నామని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ కాజీ రకీబుద్దీన్‌ అహ్మద్‌ ఏప్రిల్ 22న  ప్రకటించారు. బంగ్లా అధ్యక్షునిగా ఉన్న జిల్లియుర్‌ రహ్మాన్‌ గత నెల మరణించడంతో అధ్యక్ష స్థానానికి ఎన్నికలు నిర్వహించాల్సివచ్చింది.

Monday 15 April 2013

వెనుజువెలా అధ్యక్ష ఎన్నికల్లో మాడ్యురో విజయం



కారకస్: వెనెజువెలా అధ్యక్ష ఎన్నికల్లో చావెజ్ వారసుడు నికోలస్ మడ్యురో స్వల్ప అధిక్యంతో విజయం సాధించారు. సోషలిస్టు పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాడ్యురో 50.7 శాతం ఓట్లతో విజయం సాధించినట్లు అక్కడి ఎన్నికల అధికారులు ప్రకటించారు. విపక్ష అభ్యర్థి హెన్రిక్‌కు 49.1 శాతం ఓట్లు వచ్చాయి. హన్రిక్‌పై మాడ్యురో మూడు లక్షల మెజారిటీని సాధించారు.

Tuesday 9 April 2013

కెన్యా అధ్యక్షునిగా ఉహురు కెన్యాట్టా

                                                       
నైరోబి: కెన్యా నాలుగో అధ్యక్షునిగా ఉహురు కెన్యాట్టా ఏప్రిల్ 9న    ప్రమాణ స్వీకారం చేశారు. కెన్యా తొలి అధ్యక్షుడు జోమో కెన్వాట్టా కుమారుడైన ఉహురు(51) మార్చి 4 జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందారు.